background cover of music playing
Naalo Nenena - Mani Sharma

Naalo Nenena

Mani Sharma

00:00

05:50

Similar recommendations

Lyric

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా

ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా

ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా

అలా సాగిపోతున్న నాలోన ఇదేంటిలా కొత్త ఆలోచన

మనసే నాది మాటే నీది ఇదే మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా

ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా

ఔనో కాదో తడబాటునీ అంతో ఇంతో గడి దాటనీ

విడి విడిపోనీ పరదానీ పలుకై రానీ ప్రాణాన్నీ

ఎదంత పదాల్లోన పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపనా

మనసే నాది మాటే నీది ఇదే మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా

ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా

దైవం వరమై దొరికిందనీ నాలో సగమై కలిసిందనీ

మెలకువ కాని హృదయాన్ని చిగురైపోనీ శిశిరాన్ని

నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా

మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మై మరపునా

ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా

- It's already the end -