00:00
04:46
రాజహంసవో రాత్రిహింసవో రాచిలకా రావే
ఓ రసరంభా రావే
చంటి మన్మథా జంట తుమ్మెదా సరసానికి రారా
నీ వరసే రుచిలేరా
వయ్యారి గోదారి నీ ఒళ్ళోనే ఈదేస్తా
అందాల గంధాలన్నీ మెళ్లోనే పూసేస్తా
సరి పద మరి నీదే ఆలస్యం
సరి గమ పద నీకే ఆహ్వానం
రాజహంసవో రాత్రిహింసవో రాచిలకా రావే
ఓ రసరంభా రావే
చంటి మన్మథా జంట తుమ్మెదా సరసానికి రారా
నీ వరసే రుచిలేరా
శ్రీ చిలకమ్మ కులుకు సింగారాలే చిలుకు
ఊహల్లోనే ఉలుకు తొలి మోహంలోనే పలుకు
విరహాల వీణనే సరసంగ మీటనా
అధరాల తేనెతో మురిపాలు పంచనా
సిగ్గే మొగ్గలై విచ్చెనులే నీ బుగ్గ నిగ్గులే తేలేనులే
అన్నీ నీవని వచ్చానుగా నా కన్నెమనసునే ఇచ్చానుగా
రాజహంసవో రాత్రిహింసవో రాచిలకా రావే
ఓ రసరంభా రావే
చంటి మన్మథా జంట తుమ్మెదా సరసానికి రారా
నీ వరసే రుచిలేరా
వరకట్నంగా వయసు అది ముట్టిందంటే అలుసు
ఇచ్చేశా నా మనసు ఇక రానేరాదని తెలుసు
వయసమ్మ వాంఛలు వలలెన్నో వేయగా
కౌగిళ్ళ కంచెలు కసి ఈడుమేయగా
ముద్దుముచ్చటే ఈ రాతిరి సరిహద్దే లేనిదే నీ అల్లరి
ఎన్నాళ్లాగునమ్మ ఈ కోరిక మన తాంబూలాలకే తయారుగా
రాజహంసవో రాత్రిహింసవో రాచిలకా రావే
ఓ రసరంభా రావే
చంటి మన్మథా జంట తుమ్మెదా సరసానికి రారా
నీ వరసే రుచిలేరా