00:00
04:15
ధగ ధగమనే తూరుపు దిశ, పడమర నిశై ముగిసెనే
గల గలమనే నది పదనిస కన్నీరులో తడిసెనే
కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే
ధర్బను ధనువుగ విసిరే భార్గవరాముడు వీడే
సాధువు కలే వెలుగున పడి, సత్యం ఇలా మెరిసెనే
అజ్ఞాతమే మరగునపడి, ఆయుధమెగసనే
♪
ఎర్రగా తడిపెనే
ఏ రాచ రక్తమో నింగినే
కోరగా మెరిసెనే
పసి గరిక అంచునో కిరణమే
మెరుపుల దీపం
చమురల్లే చీకటి ఒంపి
మబ్బుల్లో వెలుతురు నింపి
చిరుజల్లులు కురుపిస్తాడే
చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి
చిగురించే నేలకు కట్టి రెండిటినీ కలిపేస్తాడే
ఆవుని వరం ఈలేదని, అయ్యోరినే నరికెనే
అంబా అని అనలేదని, పసి దూడనే నలిపెనే
కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే
ధర్బను ధనువుగ విసిరే భార్గవరాముడు వీడే
♪
సిద్ధుడి ప్రణవంలా వీడు
బుద్ధుడి శ్రవణంలా వీడు
యుద్ధమంత శబ్ధం వీడు
వీడొక ప్రమాణం
రణములా నినదిస్తుంటాడు
శరములా ఎదురొస్తుంటాడు
మరణ శరణ తోరణమితడు
వీడొక ప్రమాదం
రెప్పంచున కల
అడుగడుగున నిజమై కనిపించేలా
వీడో విడుదల
ఎన్ని ప్రాణాల మౌనాలకీవేళ
మెరుపుల దీపం
చమురల్లే చీకటి ఒంపి
మబ్బుల్లో వెలుతురు నింపి
చిరుజల్లులు కురుపిస్తాడే
చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి
చిగురించే నేలకు కట్టి రెండిటినీ కలిపేస్తాడే
ఎర్రగా తడిపెనే
ఏ రాచ రక్తమో నింగినే
కోరగా మెరిసెనే
పసి గరిక అంచునో కిరణమే
ముళ్ళినని వివరించదే పూవుల యదే ఎన్నడూ
కన్నీళ్లనే వడబోయదే
మేఘం ఎప్పుడూ