00:00
04:13
ఏయ్ పిల్లా! పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా
రా రా కంచే దూకి చక చక ఉరుకుతూ
ఆ రంగుల విల్లుని తీసి
ఈ వైపు వంతెన వేసి రావా
♪
ఎన్నో తలపులు ఏవో కలతలు
బతుకే పోరవుతున్నా
గాల్లో పతంగి మల్లె ఎగిరే కలలే నావి
ఆశ నిరాశల ఉయ్యాలాటలు పొద్దు మాపుల మధ్యే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే
నీతో ఇలా ఏ బెరుకు లేకుండా
నువ్వే ఇగ నా బతుకు అంటున్నా
నా నిన్న, నేడు, రేపు కూర్చి నీకై పరిచానే తలగడలా
నీ తలను వాల్చి కళ్ళు తెరిచి
నా ఈ दुनिया మిల మిల చూడే
వచ్చే మలపులు रस्ता వెలుగులు
జారే చినుకుల జల్లే పడుగు పేక మల్లె
నిన్ను నన్ను అల్లె
పొద్దే తెలియక గల్లీ పొడుగునా ఆడే పిల్లల హోరే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే
ఏయ్ పిల్లా! పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా
♪
పారే నదై నా కలలు ఉన్నాయే
చేరే దరే ఓ వెదుకుతున్నాయే
నా గుండె ఓలి చేసి ఆచి తూచి అందించా జాతరలా
ఆ క్షణము చాతి పైన సోలి చూసా లోకం మెరుపుల జాడే
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి నేలన కనిపిస్తుందే
మారే నీడలు గీసే
తేలే బొమ్మలు చూడే
పట్నం చేరిన పాల పుంతలు పల్లెల సంతల బారే
నాకంటూ ఉందింతే
ఉందంతా ఇక నీకే