00:00
05:44
ఓ మనిషీ
ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ
ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం
ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంతా మటుమాయమైనదీ
నీ ప్రాణం ఈ రోజె మరలా ఊపిరి పొంది
తానెవరో కనుగొన్నదీ
ఇదేరా ఇదేరా గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా
♪
వదలనిదే నీ స్వార్దం కనబడునా
పరమార్దం మనసులని గెలిచేది
ప్రేమే కదా
ప్రేమె మానవత్వం ప్రేమే దైవతత్వం
జీవించేటి దారే ఇదీ
ఇదేరా ఇదేరా, గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా
♪
యద సడిలో నిజముందీ
కను తడిలో నిజముందీ
అడుగడుగూ గుడి ఉందీ
ప్రతి మనిషిలో నివేదించు ప్రాణం
దైవంతో ప్రయాణం సగేస్తుంది నీ జీవితం
ఇదేరా ఇదేరా, గెలుపంటె ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమ్రా
♪
ఓ మనిషీ
ఓ మహర్షీ
కనిపించిందా ఉదయం
ఓ మనిషీ
ఓ అన్వేషి
వెలుగైయ్యిందా హౄదయం