00:00
04:23
తన్ననన్ననన్న తన్ననన్ననన్న న్న
తన్ననన్ననన్న తన్ననన్ననన్న న్న
తన్ననన్ననన్న తన్ననన్ననన్న
తన్ననన్ననన్న తన్ననన్ననన్న
చమకు చమకు జింజిన్న జింజిన్న
చమకు చమకు జిన్నా జిన్నా జిన్నా
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
జమకు జమకు జింజిన్న జింజిన్న
జమకు జమకు జిన్నా జిన్నా జిన్నా
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాథ పలుకై, అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై, అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడ గట్టి
కొండమల్లెలే కొప్పున బెట్టి
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
ఎండల కన్నే సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి
కోటను విడిచి పేటను విడిచి
కనుల గంగ పొంగే వేళ
నదిలా తానే సాగే వేళ
రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగల రాదారి పూదారి అవుతుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
మాగాణమ్మ చీరలు నేసే
మలిసందెమ్మ కుంకుమ పూసే
మువ్వలబొమ్మ ముద్దులగుమ్మ
మువ్వలబొమ్మ ముద్దులగుమ్మ
గడప దాటి నడిచే వేళ
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాథ పలుకై, అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై, అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడ గట్టి
పచ్చని చేల పావడ గట్టి
కొండమల్లెలే కొప్పున బెట్టి
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని
వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని