00:00
04:45
నీతో అలా రానా కలా
ఏమో ఎటో కానీ ఇలా నీతో
♪
కాలు నిలవని సతమతమే సంబరమై
వేళ తెలియని ఈ క్షణమే అద్భుతమై
ఎంత వరకని అంతు దొరకని
వింత పరుగుతో కాలం
నీతో అలా రానా కలా
నీతో అలా రానా కలా
♪
కడదాకా వెంటరాని కలనే కన్నా
ఆ నిజముతో నిన్నొదిలి వెనక్కిపోనా
కనులు వీడే గది ఏదో ఎదుటే ఉన్నా
ఈ సంతోషమంతా ఇపుడే వదులుకోనా
నీతో అలా రానా కలా
ఏమో ఎటో కానీ ఇలా నీతో
♪
కాలు నిలవని సతమతమే సంబరమై
వేళ తెలియని ఈ క్షణమే అద్భుతమై
ఎంత వరకని అంతు దొరకని
వింత పరుగుతో కాలం
నీతో అలా రానా కలా
నీతో అలా రానా కలా
నీతో