00:00
06:13
బహుశా ఓ చెంచల
ఎగిరే రాయంచలా
తగిలేలే మంచులా
చూపులో చూపుగా
ఐనా కావచ్చులే ఒకటై పోవచ్చులే
ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే
ఏ దూరమైనా చేరువై
బహుశా ఓ చెంచల
ఎగిరే రాయంచలా
తగిలేలే మంచులా
చూపులో చూపుగా
కనుపాపల్లో నిదురించి, కలదాటింది తొలిప్రేమ
తొలి చూపుల్లో చిగురించి, మనసిమ్మంది మన ప్రేమ
కలగన్నాను కవినైనాను నిను చూసి
నిను చూసాకే నిజామైనాను తెర తీసి
బహుశా ఈ ఆమని
పిలిచిందా రమ్మని
ఒకటైతే కమ్మని
పల్లవే పాటగా
అలలై రేగే అనురాగం, అడిగిందేమో ఒడి చాటు
ఎపుడూ ఎదో అనుబంధం, తెలిసిందేమో ఒక మాటు
మధుమాసాలే మనకోసాలై ఇటు రానీ
మన ప్రాణాలే శతమానాలై జత కానీ
తొలిగా చూసానులే, చెలిగా మరానులే
కలలే కన్నానులే, కలిసే ఉన్నానులే
నా నీవులోనే నేనుగా
బహుశా ఓ చెంచల
ఎగిరే రాయంచలా
తగిలేలే మంచులా
చూపులో చూపుగా