00:00
04:47
ప్రస్తుతం ఈ పాట గురించి సమాచారం లభించలేదు.
ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా
ఓ కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా
నమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపున (పున)
♪
ఎద సడిలో చిలిపి లయ
తమ వలనే పెరిగెనయా
కనుక నువ్వే తెలుపవయా
ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ
ప్రియా, ప్రియా
ఒక క్షణము తోచనీవుగా
కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా
ఓ, నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా
ఓ, అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనా
కొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనా
ఆనందమా ఆరాటమా ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ, పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపాన
ఓ, ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినా
♪
ఏకాంతమే
నీ సొంతమై
పాలించుకో ప్రణయమా
కౌగిలే కోటలా
ఏలుకో బంధమా