00:00
06:23
కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో నా కళ్లనే మూశా
చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో నే తుళ్ళుతూ చూశా
అలలా తొలి లే మంచులో తడిలా
తడి పెదవంచుపై సడిలా
రారా నా చెలిమై రారా
రారా నా సగమై రారా
కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో నా కళ్లనే మూశా
చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో నే తుళ్ళుతూ చూశా
♪
మనసులో మెరుపులే మెరిసినవి
వయసులో తనువులే నడిచినవి తోడుగా
కలిసినవి హాయిగా
మనసులో మెరుపులే మెరిసినవి
వయసులో తనువులే నడిచినవి తోడుగా
కలిసినవి హాయిగా
యుగమే క్షణమై కరిగే సుఖమై
నాలోన నువ్వేనా నువ్వేనా ఎద లోపల మాయే నువ్వేనా
నువ్వేనా ఎదపై అలా అదే పనిగా
కలలే కనని నిజం ఇదని
తనువే తడిమై ఇలా
కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో నా కళ్లనే మూశా
చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో నే తుళ్ళుతూ చూశా
♪
తపనలే తలపులో ముసిరినవి
తమకమే తరుముతూ ఉరికినది జోరుగా
తడిపినది ధారగా
తపనలే తలపులో ముసిరినవి
తమకమే తరుముతూ ఉరికినది జోరుగా
తడిపినది ధారగా
ఎదుటే కలవో నిదురై కలవో
నాలోన నువ్వేనా నువ్వేనా రసకావ్యమో
ప్రేమ నువ్వేనా నువ్వేనా విరితావిలా
ఒకే జతగా అడుగై నడిచి ఎదే పరిచి మధువై కురిసే ఇలా
కౌగిళ్ళలో ఎద వాకిళ్ళలో నా కళ్లనే మూశా
చెక్కిళ్ళలో పెదవొత్తిళ్ళలో నే తుళ్ళుతూ చూశా
అలలా తొలి లే మంచులో తడిలా
తడి పెదవంచుపై సడిలా
రారా నా చెలిమై రారా
రారా నా సగమై రారా