00:00
05:20
తెలిసి తెలియని ఊహలో
కలిసి కలవని దారిలో
ఎటు వెళ్లిందో ఎటు వెళ్లిందో మనసే
విరిసి విరియని స్నేహమై
పలికి పలకని రాగమై
ఎటు వెళ్లిందో ఎటు వెళ్లిందో మనసే
♪
పలకరించే పాటలా
మనసూగెను ఊయలా
ఎదిగింది అందమైన ఓ కలా
♪
ఏమయ్యిందో ఏమో గాని
ఎవరు పోల్చుకొని
ఇరు దారుల్లో ఎటు నడిచారో ఈ వేళా
♪
తలచి తలచి వెతికే కన్నులివిగో
తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో
ఎదురు చూసి చూసి ఎంతకాలమైనా
జత చేరకుండా ఆశ జారిపోయిన
తలచి తలచి వెతికే కన్నులివిగో
తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో
♪
తెలిసి తెలియని ఊహలో
కలిసి కలవని దారిలో
ఎటు వెళ్లిందో ఎటు వెళ్లిందో మనసే
♪
కన్నుల్లో కల నిజమవక
నిదురించావుగా ఈ హృదయాలు
ముళ్ళున్న తమ దారుల్లో
పరుగాపరులే ఈ పసివాళ్లు
ఆ నిన్నలో ప్రతి జ్ఞ్యాపకం
ఈ జంటని వెంటాడిన
ఆ లోకమే ఎటు వెళ్లిందో
కనరాదు కాస్తయినా
తలచి తలచి వెతికే కన్నులివిగో
♪
తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో
♪
ఎదురు చూసి చూసి ఎంతకాలమైనా
జత చేరకుండా ఆశ జారిపోయిన
తలచి తలచి వెతికే కన్నులివిగో
తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో
♪
ఇద్దరికి పరిచయమే
ఒక కల లాగ మొదలయ్యిందా
ఇద్దరుగా విడిపోయాక
అది కలగానే మిగిలుంటుందా
పసి వాళ్ళుగా వేరయ్యాక
ఇన్నాళ్లుగా ఏమయ్యారో
ఈ నేలపై నలుదిక్కుల్లో
ఎటు దాగి ఉన్నారో
తలచి తలచి వెతికే కన్నులివిగో
తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో
ఎదురు చూసి చూసి ఎంతకాలమైనా
జత చేరకుండా ఆశ జారిపోయిన
తలచి తలచి వెతికే కన్నులివిగో
తిరిగి తిరిగి అలిసే అడుగులివిగో