00:00
01:08
పాదం కదలనంటుందా
ఎదురుగ ఏ మలుపుందో
కాలం ముందే చూపందే
దూరం కరగదంటుందా
తారలను దోసిట పట్టే
ఆశలు దూసుకుపోతుంటే
లోతెంతో అడగననే పడవల్లే అడుగేస్తే
దారియ్యను అంటుందా కడలైన
తన కలలుగ మెరిసే
తళుకుల తీరం
నిజమై నిలిచే నిమిషం కోసం
దిశలను తరిమే ఉరుమే ప్రేమంటే
నువ్వే తన అయిదోతనమని
నీకై నోచే నోముంటే
నిత్యం నీ జీవితమంతా
పచ్చని పంటవదా
తానే నీ పెదవులుపై
చిరున్నవై నిలిచే ప్రేముంటే
ఆ తీపికి విషమైనా
అమృతమే అయిపోదా