background cover of music playing
Challa Gaali Thakuthunna - Senthil

Challa Gaali Thakuthunna

Senthil

00:00

04:05

Similar recommendations

Lyric

చల్లగాలి తాకుతున్న

మేఘమైనది మనసిలా

నేలకేసి జారుతున్న

జల్లు అయినది వయసిలా

ఎందుకంట ఇంత దగా

నిన్న మొన్న లేదు కదా (లేదు కదా)

ఉండి ఉండి నెమ్మదిగా

నన్ను ఎటో లాగుతుందా (లాగుతుందా)

తప్పదని తప్పించుకోలేనని

తోచేట్టు చేస్తున్నదా

చల్లగాలి తాకుతున్న

మేఘమైనదీ మనసిలా

నేలకేసి జారుతున్న

జల్లు అయినది వయసిలా

ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు

ఎవరేమన్నారని పొంగెనే ఏవో ఊహలు

ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు

ఎవరేమన్నారని పొంగెనే ఏవో ఊహలు

తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా

దారులు సరి అయినా వేరే తీరం చేరేనా

నడకలు నావేనా నడిచేది నేనెనా

చల్లగాలి తాకుతున్న

మేఘమైనదీ మనసిలా

నేలకేసి జారుతున్న

జల్లు అయినది వయసిలా

ఎంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో

ఇంతగా పొంగేటంత అవసరం ఏమో ఎందుకో

అయినా ఏమైనా ఎద నా చేయి జారింది

ఎపుడూ ఏనాడు ప్రేమే నేరం కాదంది

చెలిమే ఇంకోలా చిగురిస్తు ఉందటే

చల్లగాలి తాకుతున్న

మేఘమైనది మనసిలా...

నేలకేసి జారుతున్న

జల్లు అయినది వయసిలా...

- It's already the end -