background cover of music playing
Vakrathunda Mahakaya - S. P. Balasubrahmanyam

Vakrathunda Mahakaya

S. P. Balasubrahmanyam

00:00

04:47

Similar recommendations

Lyric

వక్రతుండ మహాకాయ

కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమే దేవ

సర్వకార్యేషు సర్వదా

జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా

మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా

ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి

కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి

సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి

నీ గుడిలో చేసే సత్య ప్రమాణం

ధర్మదేవతకు నిలుపును ప్రాణం

విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు

మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగ మారావు

భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు

బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు

లాభము శుభము కీర్తిని గూర్పగ లక్ష్మీగణపతివైనావు

వేద పురాణములఖిలశాస్త్రములు కళలూ చాటును నీ వైభవం

వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం

జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక

- It's already the end -