00:00
06:00
మేఘమా మరువకే
మోహమా విడువకే
మాఘమాస వేళలో మల్లెపూల మాలగా
మరునికూడి మెల్లగా మరలి రావే చల్లగా
మదిలో మెదిలే మధువై
♪
మేఘమా మరువకే
మోహమా విడువకే
♪
నిదుర కాచిన కన్నె పానుపే
రారా రమ్మంటుంటే
కురులు విప్పిన అగరువత్తులే
అలకలు సాగిస్తుంటే
సిగ్గే ఎరుగని రేయిలో
తొలి హాయిలో అలివేణి
రవికే తెలియని అందము
అందించనా నెల రాజా
కలలా అలలా మెరిసీ
♪
మేఘమా మరువకే
మోహమా విడువకే
♪
గడుసు ఉడుపులే
పరుపు విరుపులై
గిచ్చే సందడిలోన
తడవ తడవకి పెరుగుతున్నది
ఏదో మైకం భామ
మరుగే ఎరుగని కోనలో
ఆ మోజులో మహారాజ
నలిగే మల్లెల సవ్వడి
వినిపించనా నెరజాణ
జతగా కలిసి అలిసీ
♪
మేఘమా మరువకే
మోహమా విడువకే