00:00
04:08
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
♪
ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు
నాలోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
♪
నేనోర్వలేను ఈ తేజము
ఆర్పేయరాదా ఈ దీపము
ఆ చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి
మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం