00:00
04:45
రైక చూస్తే (జిడుగు జింతకుత) రాజమండ్రి
పైట చూస్తే (జిడుగు జింతకుత) పాలకొల్లు
దాని పక్కనుంటే పండుతుంది night-u
ఇంక తెల్లవార్లూ మల్లెపూల fight-u
అమ్మతోడు అబ్బతోడు గుమ్మపాప
రైక చూస్తే రాజమండ్రి
పైట చూస్తే పాలకొల్లు
♪
పంటసేలో పాల పిట్ట
వాలగానే ఈల వేసి
దోచేసాడే ఓలమ్మో
కందిసేలో కన్నె లేడి
కాలు పెట్టె వాలు చూసి
కాజేసేది ఎట్టమ్మో
మురిపాల మూగనవ్వు
పులకించి పూతకొస్తే
సరసాల సంకురాత్రి
తొలి కోడి కూతకొస్తే
రూపాయి రంగు బొమ్మ నీవేలే
ఎక్కు పెట్టాను ఏటవాలు చూపు
చిక్కు చిక్కాని కొచ్చినేడు రేపు
సుక్కతోడు పక్కతోడు చక్కనోడి
మాట చూస్తే మండపేట
పాట చూస్తే ఎంకిపాట
♪
చిత్తరింట్లో సిగ్గులాగి
చిత్తుచేసే చీకటేళ
చిందేసిందే ఓలమ్మో
ఒత్తిడింట్లో ఒళ్ళుతాకి
ఒడ్డు చేరే ఈతలోన
సింగారాలే నీవయ్యో
జడలోని జాజి పూలు
ఒడిలోన బంతులాడే
గుడి కాడ బావిసాటు
దొరికింది దొంగతోడే
పాపాయి పాల ఉంగా నాకేలే
పువ్వు కెవ్వంటే పక్కకెంత ఊపు
ఒళ్ళు జివ్వంటే ఓపలేదు కైపు
అడ్డగోలు వంగవోలు గంగడోలు
మాట చూస్తే మండపేట
పాట చూస్తే ఎంకిపాట
ఆడి చూపులోన మోగుతుంది flute-u
ఆడి ఊపులోనే boat-u ఏరు దాటు
అమ్మతోడు అబ్బతోడు గుమ్మపాప
రైక చూస్తే రాజమండ్రి
అ పైట చూస్తే పాలకొల్లు