00:00
03:37
పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే
హే ఆదమరుపులు కొంచెం
ఆటవిడుపులు కొంచెం
మూతి ముడుపులు కొంచెం
హాయి ఇంకొంచెం
చూపులేవో లేఖలు రాసే
మౌనమేదో రాగం తీసే
సైగలేవో ఊపిరి పోసే
వయసు మనకే బానిసే
నింగి అంచుకి చినుకులు పూసే
నేల అంచుకి పువ్వులు పూసే
గుండె అంచుకి గురుతులు పూసే
చేతికందే రోదసే
హే పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే
♪
హ్మ్మ్ ఒకటంటే ఒక్క జన్మే ఎవ్వరికైనా
బతుకుతూ వెతుకుదాం బతుకులో తీపిని
దూరంగా ఎగిరిపోదాం ఎక్కడికైనా
తూరుపు పడమరా దిక్కులే లేవని
ఆశలకి రెక్కలు ఊహలకి మొప్పలు
కట్టుకున్న ఈ క్షణం మాట వినదే
చూపులేవో లేఖలు రాసే
మౌనమేదో రాగం తీసే
సైగలేవో ఊపిరి పోసే
వయసు మనకే బానిసే
పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే
హే ఆదమరుపులు కొంచెం
ఆటవిడుపులు కొంచెం
మూతి ముడుపులు కొంచెం
హాయి ఇంకొంచెం
చూపులేవో లేఖలు రాసే
మౌనమేదో రాగం తీసే
సైగలేవో ఊపిరి పోసే
వయసు మనకే బానిసే
నింగి అంచుకి చినుకులు పూసే
నేల అంచుకి పువ్వులు పూసే
గుండె అంచుకి గురుతులు పూసే
చేతికందే రోదసే
హే పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే