background cover of music playing
Hrudhayam - Hemachandra Vedala

Hrudhayam

Hemachandra Vedala

00:00

03:46

Similar recommendations

Lyric

హృదయం ఓర్చుకోలేనిది గాయం

ఇకపై తలచుకోరానిది ఈ నిజం

పెదవులు విడిరాక నిలువవే కడదాక

జీవంలో ఒదగవే ఒంటరిగా

లోలో ముగిసే మౌనంగా

హృదయం ఓర్చుకోలేనిది గాయం

ఇక పై తలచుకోరానిది ఈ నిజం

ఊహాల లోకంలో ఎగరకు అన్నావే

తేలని మైకంలో పడకని ఆపావే

ఇతరుల చిరు నవ్వుల్లో

నను వెలిగించావే ప్రేమా

మరి నా కను పాపల్లో

నలుపై నిలిచావేమ్మా

తెలవారి తొలి కాంతి నీవో

బలి కోరు పంతానివో

అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి

హృదయం ఓర్చుకోలేనిది గాయం

ఇక పై తలచుకోరానిది ఈ నిజం

వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు

చల్లని చూపులతో దీవెనలిస్తాడూ

అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమౌతాడూ

చెంతకి చేరాడంటే చితిమంటే ఔతాడూ

హలాహలం నాకు సొంతం

నువు తీసుకో అమృతం

అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా

హృదయం ఓర్చుకోలేనిది గాయం

ఇక పై తలచుకోరానిది ఈ నిజం

- It's already the end -