background cover of music playing
Jagamanta Kutumbam - Sri

Jagamanta Kutumbam

Sri

00:00

04:18

Similar recommendations

Lyric

జగమంత కుటుంబం నాది

ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది

ఏకాకి జీవితం నాది

సంసార సాగరం నాదే

సన్యాసం, శూన్యం నావే

జగమంత కుటుంబం నాది

ఏకాకి జీవితం నాది

కవినై, కవితనై, భార్యనై, భర్తనై

కవినై, కవితనై, భార్యనై, భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో

మల్లెల దారిలో మంచు ఎడారిలో

పన్నీటి జయగీతాలా కన్నీటి జలపాతాలా

నాతో నేను అనుగమిస్తూ

నాతో నేనే రమిస్తూ

ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం

కలల్ని, కధల్ని, మాటల్ని, పాటల్ని

రంగుల్ని, రంగవల్లుల్ని

కావ్య కన్యల్ని, ఆడపిల్లల్ని

జగమంత కుటుంబం నాది

ఏకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై

కంటను మంటను నేనై

మింటికి కంటిని నేనై

కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై

వెన్నెల పూతల మంటను నేనై

రవినై, శశినై, దివమై, నిశినై

నాతో నేను సహగమిస్తూ

నాతో నేనే రమిస్తూ

ఒంటరినై ప్రతినిమిషం ఉంటున్నాను నిరంతరం

కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల

చరణాల్ని చరణాల చలనాన

కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని

జగమంత కుటుంబం నాది

ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది

ఏకాకి జీవితం నాది

గాలి పల్లకిలోన తరలి

నా పాట పాప ఊరేగి వెడలే

గొంతు వాకిలిని మూసి మరలి

తను మూగబోయి నా గుండె మిగిలే

నా హృదయమే నా లోగిలి

నా హృదయమే నా పాటకి తల్లి

నా హృదయమే నాకు ఆలి

నా హృదయములో ఇది సినీవాలి

జగమంత కుటుంబం నాది

ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది

ఏకాకి జీవితం నాది

- It's already the end -