background cover of music playing
Baguntundhi Nuvvu Navvithe (From "Atithi Devobhava") - Shekar Chandra

Baguntundhi Nuvvu Navvithe (From "Atithi Devobhava")

Shekar Chandra

00:00

03:42

Song Introduction

శేఖర్ చంద్ర గాయించు "బాగుంటుంది నువ్వు నవ్వితే" పాట "అతిథి దేవో భావ" చిత్రానికి చెందినది. ఈ మెలోడీ గీతంలో ప్రేమ మరియు సఖ్యత భావాలను శబ్దరూపంలో అందంగా ప్రతిబింబిస్తుంది. సంగీత దర్శకుల తరఫున సినీ స్వరం అందించిన ఈ పాట, లిరిక్స్‌ మరియు మ్యూజిక్‌తో ప్రేక్షకుల హృదయాలను అలరిస్తోంది. ఈ గానం ప్రేక్షకులకు అనేక ప్రశంసలు అందుకుంది మరియు సినిమా విజయంలో ముఖ్యమైన భాగమైందిగా నిలుస్తోంది.

Similar recommendations

Lyric

బాగుంటుంది నువ్వు నవ్వితే

బాగుంటుంది ఊసులాడితే

బాగుంటుంది గుండెమీద గువ్వలాగ నువ్వు వాలితే

బాగుంటుంది నిన్ను తాకితే

బాగుంటుంది నువ్వు ఆపితే

బాగుంటుంది కంటికున్న కాటుకంతా ఒంటికంటితే

అహాహాహాహా బాగుంది వరస

నీమీద కోపం ఎంతుందో తెలుసా

లాలిస్తే తగ్గిపోతుంది బహుశా

ఈ మనసు ప్రేమ బానిస

అయితే బుజ్జగించుకుంటానే

నిన్నే నెత్తినెట్టుకుంటానే

నువ్వే చెప్పినట్టు వింటానే

చెలి చెలి జాలి చూపవే

తడి చేసేద్దాం పెదవులని

ముడి వేసేద్దాం మనసులని

దాచేసుకుందాం మాటలని

దోచేసుకుందాం హాయిని

కాదంటానేంటి చూస్తూ నీ చొరవ

వద్దన్నకొద్దీ చేస్తావు గొడవ

నీనుంచి నేను తప్పుకోడం సులువా

కౌగిళ్ళలోకి లాగవా

అమ్మో! నువ్వు గడుసు కదా

అన్నీ నీకు తెలుసు కదా (తెలుసు కదా)

అయినా బయటపడవు కదా (పడవు కదా)

పదా పదా ఎంతసేపిలా

వెలివేసేద్దాం వెలుతురుని

పరిపాలిద్దాం చీకటిని

Hmm' పట్టించుకుందాం చెమటలని

చుట్టేసుకుందాం ప్రేమని

నువ్వేమో పెడుతుంటే తొందరలు

నాలోన సిగ్గు చిందరవందరలు

అందంగా సర్దుతూ నా ముంగురులు

మూసావు అన్ని దారులు

కొంచెం వదిలానంటే నిన్నిలా

మొత్తం జారిపోవా వెన్నెల

వేరే దారిలేక నేనిలా

బంధించానే అన్నివైపులా

బాగుంటుంది నువ్వు నవ్వితే

బాగుంటుంది ఊసులాడితే

బాగుంటుంది గుండెమీద గువ్వలాగ నువ్వు వాలితే

- It's already the end -