00:00
03:23
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం లేదు.
ఏమిటేమిటేమిటో ఏం అవుతున్నదో
ఏటవాలు దారిలో జారేదెక్కడికో
ఏమిటేమిటేమిటో ఏం కానున్నదో
ఏరు లాంటి వయసులో చేరేదెక్కడికో
తెలుసా తెలుసా నీకైనా
తెలుసా తెలుసా మరి నాకైనా
అయినా అడుగులు ఆగేనా
వెళదాం ఏదేమైనా
ఎదురుగ నువ్వు నిలబడు నిముషాన
ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా
నిజమా నిజమా
♪
నీ రాకతో నా రాతలో
ఒక్కరోజులోనే ఎన్నెన్ని మారాయలా
ఆ నింగినే నా లేఖగా మార్చుకున్నా చాలదేమో అవన్నీ నే రాయాలంటే
చెబుతా అన్ని నీ తోనా
చెబుతా రోజూ మరి రాత్రయినా
అయినా కబురులు ముగిసేనా
కలలో మళ్ళీ రానా
ఎదురుగ నువ్వు నిలబడు నిముషాన
ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా
నిజమా నిజమా