00:00
04:44
ప్రస్తుతానికి ఈ పాట గురించి సంబంధిత సమాచారం లేదు.
నా చెయ్యే పట్టుకోవా, నన్నొచ్చి చుట్టుకోవా
నాతోనే ఉండిపోవా
కన్నుల్లో నిండిపోవా, గుండెల్లో పొంగిపోవా
నిలువెల్లా ఇంకిపోవా
ఓ చెలి కోపంగా చూడకే చుడకే
ఓ చెలి దూరంగా వెళ్ళకే
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నాదే నీ ఊహనే
♪
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వెళ్ళిపోవొద్దే
నాలో పండగంటే ఏమిటంటే నిన్ను చుస్తూ ఉండడం
నాలో హాయి అంటే ఏమిటంటే నీతో నడవడం
నాలో భారమంటే ఏమిటంటే నువ్వు లేకపోవడం
నాలో మరణమంటే ఏమిటంటే నిన్ను మరవడం
ఓ చందమామ చందమామ ఒక్కసారి రావా
నా జీవితాన మాయమైన వెన్నెలంతా తేవా
మనవి కాస్త ఆలకించి ముడిపడవా
నీ చూపులే అగ్గిరవ్వలై అగ్గిరవ్వలై
బగ్గుమంటూ దూకుతున్నాయే నా మీదకి
నా ఊపిరే అందులోపడి కాలుతున్నదే
కొద్దిగైనా కబురుపెట్టు నవ్వుమేఘానికి
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నాదే నీ ఊహనే
నే నిన్ను చూడకుండ, నీ నీడ తాకకుండ
రోజులా నవ్వగలనా
నీ పేరు పలకకుండ, కాసేపు తలవకుండ
కాలాన్ని దాటగలనా
గుండెలో ఏముందో కళ్ళలో చూడవా
నిన్నలా నాతోనే ఉండవా
♪
నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పట్టనట్టు పక్కనెట్టకే నా ప్రేమని
నా ప్రాణమే తప్పుకోలేదే తప్పుకోలేదే
అంతలాగ కప్పుకున్నావే నా దారిని
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వెళ్ళిపోవొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వొద్దే వొద్దే
వెళ్ళిపోవొద్దే వెళ్ళిపోవొద్దే