00:00
03:41
పో పోవే ఏకాంతం
నా రాణి నా సొంతం
చేరుకుంది కల నిండు పూమాసంలా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా
పో పోవే ఏకాంతం
నా రాణి నా సొంతం
ఏ తోడు లేక నలిగింది సమయం
నీ నీడ తగిలాకే వెలిగింది హృదయం
నిట్టూర్పు సెగలే గతకాలగమనం
ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం
ఎదనే తడిపే చిన్నారి చినుకా
తడిసా మురిశా ఇక చాలనక
నిను తాకు గాలి నాపైన వాలి
అమ్మల్లె పాడింది అందాల లాలి
పో పోవే ఏకాంతం
నా రాణి నా సొంతం
చేరుకుంది కల నిండు పూమాసంలా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా