background cover of music playing
Priyathama Priyathama - Chinmayi

Priyathama Priyathama

Chinmayi

00:00

04:05

Similar recommendations

Lyric

ప్రియతమా ప్రియతమా

పలికినది హృదయమే సరిగమ

చిలిపి నీ తలపులో

తెలిసినది వలపులో మధురిమ

చెలి చూపు తాకినా

ఉలకవా పలకవా

వలవేసి వేచి చూస్తున్నా

దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా

ఒక్కసారి చూడరా పిల్లడా

చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా

నిన్ను కోరుకుందిరా సుందరా

ప్రియతమా ప్రియతమా

పలికినది హృదయమే సరిగమ

చిలిపి నీ తలపులో

తెలిసినది వలపులో మధురిమ

నీ ప్రేమలో ఆరాధనై

నే నిండుగా మునిగాక

నీ కోసమే రాశానుగా

నా కళ్లతో ప్రియలేఖ

చేరునో చేరదో తెలియదు ఆ కానుక

ఆశనే వీడక వెనకపడెను

మనసుపడిన మనసే

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా

ఒక్కసారి చూడరా పిల్లడా

ఉన్నానిలా ఉంటానిలా

నీ నీడగా కడదాక

కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా నువ్వులేక

దూరమే భారమై కదలదు నా జీవితం

నీవు నా చేరువై

నిలిచి మసలు మధురక్షణములెపుడో

ప్రియతమా ప్రియతమా

పలికినది హృదయమే సరిగమ

చిలిపి నీ తలపులో

తెలిసినది వలపులో మధురిమ

చెలి చూపు తాకినా

ఉలకవా పలకవా

వలవేసి వేచి చూస్తున్నా

దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా

ఒక్కసారి చూడరా పిల్లడా

చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా

నిన్ను కోరుకుందిరా సుందరా

- It's already the end -