background cover of music playing
Laali Laali - Gopika Poornima

Laali Laali

Gopika Poornima

00:00

04:48

Similar recommendations

Lyric

లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి

లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి

నీతో ఆడలంటూ నేల జారేనంట జాబిల్లి

నీలా నవ్వలంటూ తెల్లబోయి చుసేనంట సిరిమల్లి

లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి

లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి

బోసి పలుకే నువు చిందిస్తూ ఉంటే బొమ్మరిల్లాయె వాకిలి

లేత అడుగే నువు కదిలిస్తూ ఉంటే లేడి పిల్లాయె లోగిలి

నీ చిన్ని పెదవంటితే పాలనదులెన్నో ఎదలోన పొంగి పొరలి

నిను కన్న భాగ్యనికే తల్లి పదవొచ్చి మురిసింది ఇయ్యాలే

లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి

లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి

లాల నీకే నే పోసేటి వేళ అభిషేకంలా అనిపించెరా

ఉగ్గు నీకే నే కలిపేటి వేళ నైవెద్యంలా అది ఉందిరా

సిరిమువ్వ కట్టే వేళ మాకు శివ పూజే గురుతొచ్చే మరలా మరలా

కేరింత కొట్టే వేళ ఇల్లే కైలాసంలా మారే నీవల్ల

లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి ఈ గాలి

లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి

- It's already the end -