00:00
02:12
మీరలేని తలపు నీదే మేఘశ్యామ మాధవా
ఆరాధించు రాధే నేనై ప్రాణం పంచనా కృష్ణా
చెప్పలేని మూగ ప్రేమ కళ్ళలోన కనపడగా
కన్నె మనసు వెన్న దొంగై దోచె చిన్ని కృష్ణయ్య
మీరలేని తలపు నీదే
♪
వేణువూది మాయ చేసి వేలిపైన కొండను మోసి
వేల గోపి మదిలో వెలసి అలసినావ కృష్ణయ్య
విశ్రమించరా గోపాలా చాలు చాలు నీదు లీల
ఊహ నీదే ఊసు నీదే ఊపిరై నను చేరరా
మీరలేని తలపు నీదే