00:00
03:45
హే B.A. pass ఐనా
అరె M.A. pass ఐనా
B.Tech pass ఐనా
మరి M.Tech pass ఐనా
Congrats అయ్యో Super భయ్యో అనడం మానేసి
మనకే తెలియని future గురించి foolish ప్రశ్నేంటి?
Next ఏంటి? అంటూ గోలేంటి?
ఇంట్లో నాన్నైనా
వంటింట్లో అమ్మైనా
Paper Boy ఐనా
Facebookలో friend ఐనా
పరీక్షలన్నీ చించేసావని praising మానేసి
అరె వచ్చిన మార్కులు మరిచేలా ఈ question mark ఏంటి?
Next ఏంటి? ఈ గోలేంటి?
♪
కోదాడ తరువాత బెజవాడే వస్తుందంట
ఈ course'y పూర్తయ్యాక
Next ఏంటో ఏం చెబుతాం?
Interval తరువాత Climax'ey ఊహించేస్తాం
Engineering అయ్పోయాక
Next ఏంటని ఎట్టా ఊహిస్తాం?
Bulbని చేసే timeలో Edison గారిని కలిసేసి
Next ఏంటంటే పారిపోడా Bulbని వదిలేసి
అరె అంతటోల్లకే answer తెలియని ప్రశ్నను దెచ్చేసి
ఇట్టా మా మీద రుద్దేస్తే మా ఈ బ్రతుకుల గతి ఏంటి?
Next ఏంటి? ఈ గోలేంటి?
♪
प्यारలో పడిపోయాక Break-up'o పెళ్లో ఖాయం
ఈ పట్టా చేపట్టాక Next ఏంటో ఏమంటాం?
Silver Medal వచ్చాక
Gold Medal'e ఆశిస్తుటాం
ఈ degree దిరికేసాక
Next ఏంటని చెప్పడమెవడి తరం?
Branded బట్టల కోసం డబ్బులు ఇవ్వాలా ఏంటి?
బీరు బిరియానీకై చిల్లర కావాలా ఏంటి?
ఇట్టా పనికొచ్చేటి ప్రశ్నలు అస్సలు అడగరు మీరేంటి?
పైగా next ఏంటంటూ చెయ్యని తప్పుకు మాకీ శిక్షేంటి?
Next ఏంటి? అంటా
ఈ గోలేంటి? అంటా
Next ఏంటి? ఏయ్!
Next ఏంటి? అబ్బా!