00:00
03:54
మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే
సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా మునిగే మనసు అసలు బెదర లేదులే
ఉన్నది ఒక మనసు వినదది నా ఊసూ నను విడి వెళ్ళిపోవుట నేనూ చూశానే
తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి కలలో కలలా నను నేనే చూశానే
నాకేం కావాలి నేడు ఒకమాట అడిగిచూడూ
ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడూ
నాకేం కావాలి నేడు ఒకమాట అడిగిచూడూ
ఇక నీవే నాకు తోడు అని లోకమనేదెపుడూ
దోసిట పూలూ తెచ్చి ముంగిట ముగ్గూలేసి మనసును అర్పించగ ఆశపడ్డానే
వలదని ఆపునది ఏదని అడిగే మది నదిలో ఆకువలె కొట్టుకుపోయానే
గరికలు విరులయ్యే మార్పే అందం
ఎన్నో యుగములుగా మెలిగిన బంధం
ఒక వెండిగొలుసువోలె ఈ మనసు ఊగెనిపుడూ
తొడగాలి వజ్రమల్లే నే మెరియుచుంటినిపుడూ
ఒక వెండిగొలుసువోలె ఈ మనసు ఊగెనిపుడూ
తొడగాలి వజ్రమల్లే నే మెరియుచుంటినిపుడూ
మనసున ఏదో రాగం విరిసెను నాలో తేజం చెప్పలేని ఏదో భావం నాలో కలిగెలే
సంద్రపు అలలే పొంగి తీరం తాకే వేళా
మునిగే మనసు అసలు బెదర లేదులే
ఉన్నది ఒక మనసు వినదది నా ఊసు నను విడి వెళ్ళిపోవుట నేనూ చూశానే
తియ్యని స్వప్నమిది చెరగని మనోనిధి కలలో కలలా నను నేనే చూశానే
ఒక వెండిగొలుసువోలె ఈ మనసు ఊగెనిపుడూ
తొడగాలి వజ్రమల్లే నే మెరియుచుంటినిపుడూ