background cover of music playing
O Priiyatama - S. P. Balasubrahmanyam

O Priiyatama

S. P. Balasubrahmanyam

00:00

05:14

Similar recommendations

Lyric

ఆ నీలి గగనాన మెరిసేటి

ఓ దివ్యతార

ఎన్నెన్ని జన్మాలు వేచాను

నే నిన్ను చేరా

ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం

శత కోటి రాగాలు రవళించె

నా గుండెలోనా

ఓ ప్రియతమా ఇది నిజమా

ఈ పరిచయం ఒక వరమా

ఇది మనసు పడిన విరహ వేదనా

తొలి ప్రేమలోని మధుర భావనా

ఏ ముత్యము ఏ మబ్బులో

దాగున్నదో తెలిసేదెలా

ఏ స్నేహము అనుబంధమై

ఒడి చేరునో తెలిపేదెలా

నా గుండె పొదరింట

నీ కళ్లు వాలాక

ఏ ఆశ చివురించెనో

వెచ్చని నీ శ్వాస

నా మేను తడిమాక

ఏ ఊహ శృతిమించెనో

ఎన్ని జన్మాల బంధాలు

శ్రీ పారిజాతాలై విచ్చాయో చెప్పేదెలా

ఎన్ని నయనాలు నా వంక

ఎర్రంగ చూసాయో

ఆ గుట్టు విప్పేదెలా

ఓ ప్రితమా దయగనుమా

నీ చూపే చాలు చంద్ర కిరణమా

నా జన్మ ధన్యమవును ప్రాణమా

చివురాకుల పొత్తిల్లలో

వికసించిన సిరి మల్లెవో

చిరు గాలితో సెలయేటిపై

నర్తించిన నెలవంకవో

నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు

నీ అందమేమందునే

పలుకేమో రాచిలుక నడకేమో రాయంచ

ఒళ్లంతా వయ్యారమే

నీ నామాన్నే శృంగార వేధంగ భావించి

జపిస్తున్నానే చెలి

నీ పాదలే నా ప్రేమ

సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి

ఓ ప్రియతమ ఔననుమా

కనలేవ ప్రియుని హృదయవేదనా

కరుణించు నాకు వలపు దీవెనా

ఆ నీలి గగనాన మెరిసేటి

ఓ దివ్యతార

ఎన్నెన్ని జన్మాలు వేచాను

నే నిన్ను చేరా

ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం

శతకోటి రాగాలు రవళించె

నా గుండెలోనా

- It's already the end -