background cover of music playing
Kanya Kumaari - S. P. Balasubrahmanyam

Kanya Kumaari

S. P. Balasubrahmanyam

00:00

05:33

Similar recommendations

Lyric

కన్యాకుమారి కనపడదా దారి

కయ్యాలమారి పడతావే జారి

పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా

ఊగకే మరి మతిలేని సుందరి

గోపాలబాల ఆపర ఈ గోల

ఈ కైపు ఏల ఊపర ఉయ్యాల

మైకంలో మయసభ చూడు, మహరాజా రానా తోడు

సాగనీ మరి సరదాల గారడి

కొండలు గుట్టలు చిందులాడే తధిగిణతోం

వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం

తూనీగ రెక్కలెక్కుదాం, సూరిడి పక్క నక్కుదాం

కుందేటి కొమ్ము వెతుకుదాం, బంగారు జింకనడుగుదాం

చూడమ్మో హంగామా

అడివంతా రంగేద్దాం, సాగించే variety program

కళ్ల విందుగా పైత్యాల పండగ

కన్యాకుమారి కనపడదా దారి

కయ్యాలమారి పడతావే జారి

మైకంలో మయసభ చూడు, మహరాజా రానా తోడు

సాగనీ మరి సరదాల గారడి

డేగతో ఈగలే fight చేసే చెడుగుడులో

చేపలే చెట్టుపై పళ్లు కోసే గడబిడలో

నేలమ్మ తప్పతాగెనో, ఏ మూల తప్పిపోయెనో

మేఘాల కొంగుపట్టుకో, తూలేటి నడకనాపుకో

ఓయమ్మో మాయమ్మో

దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం

ఒళ్లు ఊగగా ఎక్కిళ్లు రేగగా

గోపాలబాల ఆపర ఈ గోల

ఈ కైపు ఏల ఊపర ఉయ్యాల

పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా

ఊగకే మరి మతిలేని సుందరి

సాగనీ మరి సరదాల గారడి

- It's already the end -