00:00
04:30
ప్రేమా!
ప్రేమా!
ఓ ప్రేమా!
ఓ ప్రేమా!
♪
ప్రేమా! సుడిగాలై నువ్వే ఉంటే చిరుగాలై చేరనా
నిశిలాగా నువ్వే ఉంటే నిను నీడై తాకనా
నదిలాగా నువ్వే ఉంటే చినుకై నే చిందనా
అడిగా బదులడిగా నీ అడుగై నడిచే మార్గం చూపుమా... చూపుమా...
పిలిచా నిను పిలిచా నీ కలలో నిలిచే మంత్రం చెప్పుమా... చెప్పుమా...
ప్రియమేఘం కురిసే వేళ పుడమెంత అందమో
మరుమల్లి మందారాల చెలిమెంత అందమో
ఎగసే అలలెగసే నీ ప్రేమలొ అందం ఎదనే లాగెనే... లాగెనే...
♪
గుండెల్లొ నిండే మోహం శ్వాసల్లొ ధూపం వేసే
చుట్టూర పొగలై కమ్మెనే గుట్టంత తెలిపేనే
తలుపులు వదలని యోచన, పెరిగెను మనసున యాతన
ప్రాయము చేసే ప్రార్ధన, పరుగున వచ్చే మోహన
ఓ' చైత్రమాసాన మేఘమే చిందేను వర్షం...
కోనల్లోన మోగదా భూపాళ రాగం...
ప్రేమా! ఓ ప్రేమా! మన నీడల రంగులు నేడే కలిసెనే... కలిసెనే...
చెలిమే మన చెలిమే ఒక అడుగై పెరిగి అఖిలం ఐనదే... ఐనదే...
ఓ' అనురాగం పాడాలంటే మౌనం సంగీతమే
అనుబంధం చూపాలంటే సరిపోదె జన్మమే...