background cover of music playing
Raa Rammani - S. P. Balasubrahmanyam

Raa Rammani

S. P. Balasubrahmanyam

00:00

04:55

Similar recommendations

Lyric

రా రమ్మని

రా రా రమ్మని

రా రమ్మని రారా రమ్మని

రామచిలుక పిలిచెను ఈ వేళ

అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా

ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా

లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ

మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో

ప్రేమించుకోనా ప్రతిజన్మలో

కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో

విహరించనా నీ హృదయాలయంలో

రా రమ్మని

రా రమ్మని రా రా రమ్మని

రామచిలుక పిలిచెను ఈ వేళచరణం

పెదాల్లో ప్రథమ పదము నువ్వే

ఎదల్లో తరగని గని నువ్వే

జగంలో అసలు వరము నువ్వే

జనాల్లో సిసలు దొరవు నువ్వే

అణువణువున నాలో నువ్వే

అమృతమే చిలికావే

అడుగడుగున నాతో నువ్వే

అద్భుతమే చూపావే

నిజంలో నువ్వు నిదర్లో నువ్వు

సదా నావెంట ఉండగా

ఇదేగా ప్రేమపండుగ

రా రమ్మని

రా రమ్మని రారా రమ్మని

రామచిలుక పిలిచెను ఈ వేళ

ఫలించే పడుచు ఫలము నీకే

బిగించే కౌగిలి గిలి నీకే

సుమించే సరస కవిత నీకే

శ్రమించే చిలిపి చొరవ నీకే

ఎదిగొచ్చిన పరువం నీకే

ఏదైనా నీకొరకే

నువు మెచ్చిన ప్రతిదీ నీకే

నా యాతన నీకెరుకే

సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా

సుఖిస్తాను నీ పంచన

రా రమ్మని

రా రమ్మని రారా రమ్మని

రామచిలుక పిలిచెను ఈ వేళ

అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా

ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా

లే లెమ్మని ఇల్లెల్లాహి లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ

మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో

ప్రేమించుకోనా ప్రతిజన్మలో

కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో

విహరించనా నీ హృదయాలయంలో

- It's already the end -