00:00
04:58
తెలుసా నేస్తమా నేస్తమా పూజించానని
నీవే ఆశగా శ్వాసగా జీవించానని
మదిలో మౌన రాగమే
మెదిలే మెల్ల మెల్లగా
కదిలే నీలి మేఘమే
కరిగే తేనె జల్లుగా
తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించానని
నీవే ఆశగా శ్వాసగా జీవించానని
మదిలో మౌన రాగమే
మెదిలే మెల్ల మెల్లగా
కదిలే నీలి మేఘమే
కరిగే తేనె జల్లుగా
♪
మౌనమే కరగాలి మంత్రమై మ్రోగాలి
మదిలో నీ ప్రేమ మందిరమవ్వాలి
మమతలే పండాలి మనసులే నిండాలి
దైవం పలకాలి దీవెనలివ్వాలి
ప్రేమ పైన నమ్మకాన్ని
పెంచుకున్న చిన్నదాన్ని
ప్రేమతోనే జీవితాన్ని
పంచుకుంటూ ఉన్నవాణ్ని
చెప్పలేని ఎన్ని ఆశలో చిన్ని గుండెలోన
♪
తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించానని
నీవే ఆశగా శ్వాసగా జీవించానని
♪
ఎదురుగా రారాజు కదలగా ఈరోజు
పరువం పులకించి పరుగులు తీసింది
ఓ ప్రేమలో మమకారం ఏమిటో తెలిసింది
పున్నమిలా ఎదలో వెన్నెల కురిసింది
నింగి విడిచి గంగలాగ
నిన్ను చేరుకున్నదాన్ని
కొంగులోనే దాచుకోవే
పొంగుతున్న సాగరాన్ని
ఆడపిల్ల మనసు తెలిసిన
తోడు నీడ నీవే
♪
తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించానని
నీవే ఆశగా శ్వాసగా జీవించానని
మదిలో మౌన రాగమే
మెదిలే మెల్ల మెల్లగా
కదిలే నీలి మేఘమే
కరిగే తేనె జల్లుగా